ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్న నటుడు శరత్‌కుమార్‌ని ఓడించాలనే పట్టుదలతో సీనియర్ నటుడు నాజర్, యువ హీరోలు విశాల్, కార్తీ తదితరులు భారీ ఎత్తున ప్రచారం చేశారు.
చివరికి అనుకున్నది సాధించారు. కాగా, శరత్‌కుమార్‌ని సపోర్ట్ చేసినవాళ్లల్లో హీరో శింబు ఒకరు. ఆయన ఓడిపోవడం ఈ హీరోని బాధపెట్టి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, ఉపాధ్యక్షుడిగా శరత్‌కుమార్ ప్యానెల్ నుంచి పోటీపడిన శింబూకి కూడా నిరుత్సాహమే ఎదురైంది. కాగా, కొన్నేళ్లుగా నడిగర్ సంఘంలో సభ్యుడిగా ఉన్న శింబు ఇప్పుడు తప్పుకుంటున్నానని పేర్కొనడం విశేషం.
ఏ ఆర్టిస్ట్‌కైనా సమస్య వచ్చినప్పుడు, దాని పరిష్కారానికి నడిగర్ సంఘం ముందుకు రావాలని శింబు అన్నారు. తనకు సమస్య వచ్చినప్పుడు నడిగర్ సంఘం ఏ సహాయమూ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, ఇటీవల నిర్వహించిన స్టార్ క్రికెట్ మ్యాచ్ పట్ల కూడా తాను అసంతృప్తిగా ఉన్నానని శింబు పేర్కొన్నారు.