స్నాప్ డీల్ లో ఏదైనా మొబైల్ ఫోన్ కొంటే, నాలుగు గంటల్లో మన చేతిలోకి వచ్చేస్తుంది. దీంతో మొబైల్ కొనుగోలులో స్నాప్ డీల్ కు ఫుల్ క్రేజ్ పెరిగింది. ఈ విధంగా అన్ని వస్తువులను నాలుగు గంటల్లోనే వినియోగదారుల ముందుంచాలని స్నాప్ డీల్ నిర్ణయించింది. డెలివరీ టైమ్ ను గతేడాది కంటే 70శాతం పెంచుకున్నామని, ఫోన్లకే పరిమితమైన ఈ నాలుగు గంటల డెలివరీని మరిన్ని వస్తువులకు అందజేయనున్నట్టు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆశిష్ చిత్రవంశీ తెలిపారు.
దాదాపు వినియోగదారులు కొనుకునే 99 శాతం ఉత్పత్తులను అదే రోజు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ ఉత్పత్తులను నాలుగు గంటలోనే అందించేలా ప్రణాళికలు చేస్తున్నామని చెప్పారు. భారత ఈ-కామర్స్ వ్యాపారంలో అగ్రగామిగా ఉన్న గూర్గావ్ కు చెందిన ఈ సంస్థ, దాదాపు రూ.1,300 కోట్లు పెట్టుబడులతో 2 మిలియన్ల చదరపు అడుగుల గిడ్డంగి సామర్థ్యంతో 2015లో మార్కెట్లోకి ప్రవేశించింది. 2015లో 7 శాతం ఉత్పత్తులను మాత్రమే తన గిడ్డంగి నుంచి అందజేసిన ఈ సంస్థ, ప్రస్తుతం 70శాతం ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేస్తోంది. క్రమేపి తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఉత్పత్తులను త్వరగా వినియోగదారులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చిత్రవంశీ చెప్పారు.

source:సాక్షి దినపత్రిక