మంచు విష్ణు రాజ్ తరుణ్ మల్టీ స్టార్ట్ గా తెరకెక్కిన ఈడోరకం ఆడోరకం చిత్రం పంజబిలో ఘన విహాయం సాదించి న సినమకు రిమేక్ గా జి .నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. మంచు విష్ణు కూడా చాల రోజుల నుండి సరైన హిట్ కోసం ఎదురు చూస్తానన సమయం లో ఈ సినిమా వారికీ ఎంతమేరకు ప్లేస్ అయిందో చూడాలి మరి ఈ సినిమా పక్కా కామెడి ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు దర్శకుడు నాగేశ్వరరెడ్డి మరి ఈ సినిమాతో భారి హిట్ట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ఇద్దరు హీరోలకు ఈ సినిమ ఎంత మేరకు ప్లేస్ అయిందో చూద్దాం మరి.
కథ: అడ్వకేట్ నారాయణ (రాజేంద్రప్రసాద్) కొడుకు అర్జున్ (విష్ణు), ఎస్.ఐ. కోటేశ్వరరావు (పోసాని కృష్ణమురళి) కొడుకు అశ్విన్ (రాజ్ తరుణ్) స్నేహితులు. పనీపాటా లేకుండా తిరిగే వీరికి ఓ స్నేహితుడి పెళ్ళిలో నీలవేణి (సోనారిక), సుప్రియ (హేబ పటేల్) లతో పరిచయం జరుగుతుంది. అనాథనే పెళ్ళి చేసుకోవాలన్నది నీలవేణి అభిప్రాయమైతే, కుటుంబం వున్న ఓ ఆస్తిపరుడిని పెళ్ళాడాలన్నది సుప్రియ కోరిక. నీలవేణి పడేసేందుకు అనాథగా డ్రామా మొదలెట్టి ఆమెను సొంతం చేసుకుంటాడు అర్జున్. అంతలోనే సడెన్‌గా వీరి పెళ్ళయిపోతుంది. వేరు కాపురం పెట్టేందుకు అర్జున్ వాళ్ళ ఇంటిలోనే అద్దెకు దిగుతుంది నీలవేణి. ఈ విషయం తెలిసినా అర్జున్ ఏం చేయలేని పరిస్థితి. తన కుటుంబం విషయం నీలవేణికి తెలీకుండా, తన పెళ్ళి విషయం కుటుంబానికి తెలీకుండా అశ్విన్‌ని నీలవేణి భర్తగా తన ఇంటివారికి పరిచయం చేస్తాడు అర్జున్. సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే అశ్విన్, సుప్రియలు పెళ్ళి జరుగుతుంది. చివరికి ఈ కన్ఫ్యూజన్ డ్రామా ఎలా ముగిసింది అన్నదే సినిమా.
విశ్లేషణ : అబద్దపు డ్రామాతో మొదలైన ఈ సినిమా ఆద్యంతం అతుకుల బొంతలా సాగింది. గతంలో ఇలాంటి కథతోనే బోలెడన్ని సినిమాలొచ్చాయి. హీరో పరిచయం దగ్గరి నుండి క్లైమాక్స్ వరకు దర్శకుడు ఒక సన్నివేశంపైనే కథను నడిపాడు. పాత్రల చిత్రణపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రేమ, వినోదం లాంటి ఏ ఒక్క భావోద్వేగమూ సినిమాలో పండలేదు. హీరోయిన్ల వస్త్రాలంకరణ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. చీరల్లో సోనారిక, మోడ్రన్ దుస్తుల్లో హేబ అభినయం కంటే అందాన్ని ఇష్టపడే ప్రేక్షకులను రెప్పవేయనీరు. హీరోయిన్ల అన్నలను పెద్ద రౌడీలుగా పరిచయం చేసిన దర్శకుడు తర్వాత వాళ్ళ సంగతే మర్చిపోయి విష్ణు లోని యాక్షన్ కోణాన్ని బయటకు తీసేందుకు క్లైమాక్స్ ఫైట్‌లో వారిని తెరమీదికి తీసుకొచ్చాడు. ఉన్నంతలో రాజేంద్ర ప్రసాద్ నటన బాగుంది. ప్రాసతో నిండిపోయిన డబుల్ మీనింగ్ డైలాగులకు ఈ సినిమాలో ఏమాత్రం లోటులేదు. వెన్నెల కిషోర్, షకలక షంకర్ పాత్రలు అతిథి పాత్రల్లా ఉన్నాయి. నిడివి కాస్త ఉన్నప్పటికీ పాత్రలో బలం లేకపోవడంతో రవిబాబు లాంటి నటులు పెద్దగా చేయడానికి ఏమీ లేదు. సాంకేతికంగా సినిమాకి కెమెరా ప్లస్‌గా నిలిచింది. ఎకె ఎంటర్టైన్‌మెంట్ నిర్మాణ విలువలు కథ, కథనాల్లో లోపం వల్ల నాసిరకం సరుకుని దగదగ మెరుపులు దిద్దడానికే ఉపయోగపడ్డాయి. సాయి కార్తీక పాటలు, నేపథ్య సంగీతం వల్ల కూడా సినిమాకి ఒరిగిందేమీ లేదు.